Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:05 AM

తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆశయాలు సాధించాలి

10-03-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

సమాజంలోని అన్ని వర్గాల మహిళలు విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో పాఠశాలను స్థాపించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆశయాలను సాధించాలని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జుట్టుకొండ సత్యనారాయణ, బి ఆర్ ఎస్ నాయకుడు వై వెంకటేశ్వర్లు, ప్రముఖ న్యాయవాది మాజీ కౌన్సిలర్ ఊర గాయత్రి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చలమల్ల నరసింహ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. స్త్రీలకు విద్య అందించి సమాజంలో చైతన్యం కలిగించిన గొప్ప నాయకురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. విద్యాభివృద్ధి మాత్రమే కాకుండా బాల్య వివాహాలు, సతీసహగమనం, అంటరానితనం, వరకట్నం వంటి సామాజిక దురాచారాలను అరికట్టడంలో ఆమె పాత్ర ఎంతో గొప్పదని అన్నారు.సావిత్రిబాయి పూలే చేసిన త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేయడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భూపతి నారాయణ గౌడ్, నిద్ర సంపత్ నాయుడు, చిలువేరు నరసింహారావు, కందాల భాస్కర్, గుండు కల్పన, పోతరాజు నరసయ్య, సముద్రాల రాంబాబు, బత్తుల దశరథ, మిట్ట కోల యుగంధర్, తండు సతీష్ గౌడ్, బడుగు లక్ష్మీనారాయణ, భీమన్న పెళ్లి వెంకటేశ్వర్లు, దోరపల్లి రవి, బైరు విజయ్ కృష్ణ, బండ పెళ్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆశయాలు సాధించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News