Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఆసియన్ చెస్ చాంపియన్ మేకల అభినవ్ జయంతి..... పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 23, 2026 09:11 PM

తీరిన 40 ఏళ్ల కల – వెలగమేకలపల్లికి రూ.1.48 కోట్ల బీటీ రోడ్డు

తీరిన 40 ఏళ్ల కల – వెలగమేకలపల్లికి రూ.1.48 కోట్ల బీటీ రోడ్డు

తీరిన 40 ఏళ్ల కల – వెలగమేకలపల్లికి రూ.1.48 కోట్ల బీటీ రోడ్డు
February 25, 2026 01:04 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం, వెలగమేకలపల్లి గ్రామానికి 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రహదారి కల నెరవేరింది. గ్రామానికి రూ.1 కోటి 48.5 లక్షల వ్యయంతో నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి బుధవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

సవితమ్మ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కన్వీనర్ వెంకటేష్, రాష్ట్ర సాగర్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, రాష్ట్ర బోయ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డీవీ ఆంజనేయులు, హిందూపురం పార్లమెంట్ టీడీపీ కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్ పాల్గొన్నారు. గుత్తేదారు ధనుంజయ నాయుడు భూమి పూజ నిర్వహించి, 40 రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

నేతలు మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో గ్రామానికి వచ్చిన మంత్రి సవిత రోడ్డు వేయిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. 40 ఏళ్లుగా రహదారి లేక గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఈ రోడ్డు నిర్మాణంతో వారి కష్టాలు తీరనున్నాయని అన్నారు. గత పాలకులు అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

అదేవిధంగా, గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి రూ.20 లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి కూడా మంత్రి సవిత నాంది పలికారని, త్వరలోనే ఆ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సోమందేపల్లి డిప్యూటీ ఎంపీడీఓ ప్రేమ్ కుమార్, మాజీ కన్వీనర్ సిద్దలింగప్ప, చల్లపల్లి మాజీ సర్పంచ్ రామకృష్ణ, శరత్ చంద్ర, రంగప్ప, రామిరెడ్డి, పందిపర్తి శ్రీనివాసరెడ్డి, వెలగమేకలపల్లి నరసింహులు, శివశంకర యాదవ్, జేసీబీ రంగా, డీలర్ బాలు, గట్టు మహేంద్ర, జనసేన నాగరాజు, మహిళా నాయకురాళ్లు అనసూయ, సుధారాణి తదితర కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News