Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:35 AM

తీపి–చేడు సమ్మేళనమే ఉగాది: ఎమ్మెల్యే వేముల వీరేశం

19-03-2026 93 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్: ఉగాది పండుగ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తన స్వగృహంలో నిర్వహించిన ఉగాది పచ్చడి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. పరాభవ నామ సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉగాది పండుగ తీపి–చేడు అనుభవాల సమ్మేళనమని, ప్రతి మనిషి జీవితంలో సంతోషాలు, కష్టాలు రెండూ సమానంగా ఉంటాయని చెప్పారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

వ్యవసాయ సంవత్సరానికి శ్రీకారం చుట్టే ఉగాది రైతులకు ఎంతో ముఖ్యమని పేర్కొన్న ఆయన, సాగునీరు–తాగునీటి సదుపాయాలు మెరుగై పచ్చని పంటలతో తెలంగాణ రాష్ట్రం నిత్యవసంతంగా మారిందన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధితో అనుబంధ వృత్తులు బలపడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టమైందని తెలిపారు.

తెలంగాణ సాధిస్తున్న ప్రగతి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఇంటిల్లిపాదిగా ఉగాది పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.

Sthanikam

తీపి–చేడు సమ్మేళనమే ఉగాది: ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News