Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 10:02 PM

తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్ – ఉన్నం సత్యనారాయణ రావు

18-01-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అని కమ్మ జన సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఉన్నం సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ పార్కు వద్ద ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా కమ్మ జన సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. కేవలం 9 నెలల వ్యవధిలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చిన చరిత్ర ఎన్టీఆర్‌కే దక్కిందని గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎనలేని కృషి చేసిందని పేర్కొన్నారు. తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేస్తూ, ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా ఎన్టీఆర్ నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మ జన సేవా సమితి సభ్యులు శంకర్ ప్రసాద్, దారపు నేని శ్రీనివాసరావు, రవీంద్రబాబు, ఆంజనేయులు, శంకర్ ప్రసాద్, నాగేశ్వరరావు, వెంకటరమణ, మోహన్ రావు, గోపి తదితరులు పాల్గొని ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు.

Sthanikam

తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్ – ఉన్నం సత్యనారాయణ రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News