Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:39 AM

తెలుగు వాడి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ – మోరంపూడి శ్రీనివాసరావు

16-03-2026 128 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అని నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు కొనియాడారు.

ఆదివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వేంసూరు మండలం లచ్చన్నగూడెం గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ… తెలుగువాడి ఆత్మగౌరవమే నినాదంగా, పేదవాడికి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ కల్పించాలనే పవిత్ర లక్ష్యంతో, “సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అనే మహోన్నత భావనతో తెలుగు దేశం పార్టీని స్థాపించిన మహానేత నందమూరి తారక రామారావు అని గుర్తుచేశారు.

పార్టీ స్థాపించిన నవమాసాలు కూడా పూర్తికాకముందే కాంగ్రెస్ కుంభస్థలాన్ని కుమ్మేసి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ పేదవాడి కూటి కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం అమలు చేశారని, గుడ్డ కోసం సగం ధరకే జనతా వస్త్రాలను అందజేశారని తెలిపారు. అలాగే పక్కా గృహ నిర్మాణ పథకం ద్వారా పేదలకు గూడు కల్పించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని ప్రశంసించారు.

పటేల్–పట్వారీ వ్యవస్థను రద్దు చేసి రైతులకు మేలు చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని మోరంపూడి పేర్కొన్నారు. తెలుగు వాడి కీర్తి, ప్రతిష్టలను దశదిశలా వ్యాపింపజేసిన మహానేతగా ఎన్టీఆర్ చిరస్మరణీయుడని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా తెలుగు దేశం పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

తెలుగు వాడి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ – మోరంపూడి శ్రీనివాసరావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News