Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

తుపాకీతో కాల్చి.. బండరాయితో మోది.. వెంకటరత్నం దారుణ హత్య!

Updated : 09 Dec 2025 12:37 IST
As Preferred Source 1 min read
తుపాకీతో కాల్చి.. బండరాయితో మోది.. వెంకటరత్నం దారుణ హత్య!

హైదరాబాద్ క్రైమ్ బ్యూరో స్థానీకం:

అరె, హైదరాబాద్ నడిబొడ్డున మల్కాజిగిరి ఏరియాల ఘోరం జరిగింది. వెంకటరత్నం అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని దుండగులు దారుణంగా నడిరోడ్డు మీదనే వేసిపారేసిన్రు. ఈ ఘటన జవహర్‌నగర్ సాకేత్ కాలనీల కలకలం రేపింది.

ఎవరీ వెంకటరత్నం? ఎందుకీ హత్య? పోలీసోళ్లు చెప్తున్న ముచ్చట ప్రకారం, ఈ వెంకటరత్నం మీద గతంలనే రెండు జాయింట్ మర్డర్ కేసులు ఉన్నాయట. ముఖ్యంగా ధూల్‌పేట ఏరియాల జరిగిన జంట హత్యల కేసుల ఈయన ప్రధాన నిందితుడు. గిదే పాత కక్షలు మనోడి ప్రాణం మీదకు తెచ్చినయని అనుమానిస్తున్నరు.

అసలేం జరిగింది? నిన్న పొద్దుగాల (సోమవారం) వెంకటరత్నం తన బిడ్డను స్కూల్ కాడ దింపి టూవీలర్ మీద ఇంటికి వస్తుంటే, పక్కా ప్లాన్ ప్రకారం ఓ ఆటోల, బైక్ మీద వచ్చిన దుండగులు అడ్డగించిన్రు.

మొదట బండిని గుద్ది కిందపడేసిన్రు.

లేవకముందే కత్తులతోటి పొడిచి, రాళ్లతోటి తల మీద మోది, ఆఖరుకు తుపాకీతోటి కాల్చి చంపేసిన్రు.

ఎవరు చంపిన్రు? సీసీటీవీల రికార్డయిన ఫుటేజీ చూస్తుంటే, ఇది పక్కా పాత కక్షలనే అనిపిస్తాంది. వచ్చినోళ్లు మంగళ్‌హాట్ ఏరియాోళ్లని పోలీసులు అనుమానిస్తున్నరు. పాత గొడవల బాకీ తీర్చుకోవడానికే ఈ స్కెచ్ వేసినట్టు ఉంది. క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది, దుండగుల కోసం గాలింపు మొదలువెట్టిన్రు.

మొత్తానికి పాత పాపం ఊరికే పోదు అన్నట్టు, ఆనాడు చేసిన హత్యలే ఈనాడు వెంకటరత్నం ప్రాణం తీసినయని జనాలు అనుకుంటున్నరు.

Sthanikam

తుపాకీతో కాల్చి.. బండరాయితో మోది.. వెంకటరత్నం దారుణ హత్య!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news