Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:50 AM

తిరుపతి దర్శనం పేరిట విశ్రాంత ఉద్యోగికి టోపీ రూ.18.46 లక్షలు కాజేసిన ఆలయ పూజారి

తిరుపతి దర్శనం పేరిట విశ్రాంత ఉద్యోగికి టోపీ రూ.18.46 లక్షలు కాజేసిన ఆలయ పూజారి

తిరుపతి దర్శనం పేరిట విశ్రాంత ఉద్యోగికి టోపీ రూ.18.46 లక్షలు కాజేసిన ఆలయ పూజారి
March 12, 2026 07:28 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఓద్వారం గ్రామంలో తిరుపతి దర్శనం టిక్కెట్లు బుక్ చేస్తానని చెప్పి విశ్రాంత ఉద్యోగిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పూజారి సాయి తరుణ్ ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం, ఓద్వారం గ్రామానికి చెందిన ఒక విశ్రాంత ఉద్యోగి ప్రతిరోజూ ఆలయానికి దర్శనానికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో అక్కడ పూజారిగా ఉన్న సాయి తరుణ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న పూజారి తిరుపతి దర్శనం టిక్కెట్లు, రైలు టిక్కెట్లు బుక్ చేసి ఇస్తానని చెప్పి బాధితుడి నమ్మకాన్ని సంపాదించాడు.

టిక్కెట్లు బుక్ చేయాలనే నెపంతో బాధితుడి మొబైల్ ఫోన్ తీసుకున్న సాయి తరుణ్, పాస్‌వర్డ్ తెలుసుకుని బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన సందేశాలు రాకుండా సెట్టింగులు మార్చినట్లు తెలిసింది. అనంతరం ప్రతిరోజూ ఫోన్ తీసుకుంటూ బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.99,999 చొప్పున మొత్తంగా 30 విడతల్లో రూ.18.46 లక్షలను దామెర హరీష్ అనే వ్యక్తి ఖాతాకు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఇటీవల డబ్బులు అవసరమై బాధితుడు బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో డబ్బులు లేవని అధికారులు తెలియజేశారు. దీంతో స్టేట్‌మెంట్ తీసి పరిశీలించగా ప్రతిరోజూ ఉదయం 9 గంటలలోపు భారీ మొత్తాలు బదిలీ అయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దామెర హరీష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న పూజారి సాయి తరుణ్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News