Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:50 PM

తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమమే టీడబ్ల్యూజేఎఫ్ లక్ష్యం*

తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమమే టీడబ్ల్యూజేఎఫ్ లక్ష్యం*

తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమమే టీడబ్ల్యూజేఎఫ్ లక్ష్యం*
January 05, 2026 05:28 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేటలో భారీగా సభ్యత్వ నమోదు

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్)రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై ఉద్యమించడంతో పాటు యూనియన్ బలోపేతానికి భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కేంద్రంలో ఫెడరేషన్ సూర్యాపేట అడ్ హక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా అడ్ హక్ కమిటీ కన్వీనర్, కో కన్వీనర్లు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు రాష్ట్రంలో గుర్తింపు పొందాల్సిన అవసరం ఉందన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో జర్నలిస్టుల సమస్యలు తీవ్రంగా నిర్లక్ష్యం చేయబడ్డాయని, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై జర్నలిస్టుల హక్కుల కోసం న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాం"

అని అన్నారు. అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు ఇల్లు,ఇంటి స్థలం, హెల్త్ కార్డు, అక్రిడిటేషన్ కార్డు లభించాలన్నదే టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన డిమాండ్ అని, ఈ డిమాండ్ల పై ప్రభుత్వం స్పందించకపోతే, దశలవారీగా పోరాటం చేపడతామని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల పక్షాన పోరాడేందుక టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ బలోపేతం అవుతుందని అన్నారు. సూర్యాపేట జిల్లాలో సభ్యత్వ నమోదు జరుగుతుందని, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో జరిగే సభ్యత్వ నమోదు సందర్భంగా జర్నలిస్టులు సభ్యత్వం తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు. త్వరలో జిల్లా మహాసభ జరుగుతుందని, సభ్యులందరు మహాసభకు సమాయత్తం కావాలని కోరారు.

ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు తమ సభ్యత్వాలు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పాల్వాయి జానయ్య, కో కన్వీనర్లు ముషం హరిప్రసాద్, లింగాల సాయిబాబా, శ్రీరాముల కృష్ణ, నందిపాటి సైదులు, గూడపూరి ప్రభు, నజీర్ ఖాన్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News