Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:33 AM

తడి-పొడి చెత్త నిర్వహణపై అవగాహన

తడి-పొడి చెత్త నిర్వహణపై అవగాహన

తడి-పొడి చెత్త నిర్వహణపై అవగాహన
24-03-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో తడి, పొడి చెత్త వేరు చేయడం మరియు ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ క్షేత్ర పర్యటనలో భాగంగా వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామంలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని సందర్శించి, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానం, కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియపై ప్రాయోగిక అవగాహన పొందారు.

కార్యక్రమంలో టీఎన్‌జీసీ కోఆర్డినేటర్ సూర్యకిరణ్, కళాశాల ప్రిన్సిపల్ దరిపల్లి ప్రవీణ్ కుమార్, స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ మిర్యాల మురళి, ఈకో క్లబ్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ పాల్గొని వివరించారు.

ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, రోజువారీ జీవితంలో తడి-పొడి చెత్త వేరు చేసే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. గ్రామ సర్పంచ్ రాంపల్లి కృష్ణ, ఉప సర్పంచ్ అందే మల్లేష్ కూడా చెత్త నిర్వహణ పద్ధతులపై వివరించారు.

కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధ్యాపకులు ప్రభాకర్, మాధవి, శ్రీశైలం, అంజయ్య, రమేష్, శ్రీనివాస్, ముత్తిరెడ్డిగూడెం సర్పంచ్ రాంపల్లి కృష్ణ ఉప సర్పంచ్ అందే మల్లేష్ ,వార్డ్ సభ్యులు జక్కుల మల్లేష్, కొండమడుగు అశోక్, ముత్తిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి కంచుగల్ల కృష్ణయ్య తోపాటు ఫీల్డ్ అసిస్టెంట్ పల్లెర్ల కుమార్ వాత్సల్య కళాశాల విద్యార్థిని విద్యార్థులు, గ్రామ పంచాయతీ సిబ్బంది మొదలైన వారు పాల్గొని తడి చెత్త పొడి చెత్త ఫీల్డ్ ట్రిప్ ను విజయవంతం చేశారు.

Sthanikam

తడి-పొడి చెత్త నిర్వహణపై అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News