Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:51 AM

టీయూడబ్ల్యూజే ఐజేయు ఎల్లప్పుడూ జర్నలిస్టుల పక్షమే

01-06-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో టియుడబ్ల్యూజే ఐజేయు రాజీలేని పోరు

జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంపుదలకు శిక్షణ తరగతులు

టీయూడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టుల సమస్యలపై ఎల్లప్పుడూ రాజీలేనిపోరు సల్పుతోందని, జర్నలిస్టుల పక్షాన అర్థ శతాబ్ద కాలంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు అన్నారు. టీయూడబ్ల్యూజే ఐజేయు సభ్యత్వ క్యాంపెయిన్ లో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీనియర్ జర్నలిస్టులు ఎస్కే ఆసిఫ్, ఎస్కే అహ్మద్ లకు యూనియన్ సభ్యత్వం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల పక్షపాతిగా యూనియన్ పేరు పొందిందని చెప్పారు. పాలకులు ఎవరైనా, ప్రభుత్వం ఏదైనా జర్నలిస్టులను పక్షాన నిలబడి కలబడే సంఘం ఒకే ఒక్క టీయూడబ్ల్యూజే ఐజేయు అని స్పష్టం చేశారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు అందజేసే బాధ్యత జిల్లా మీడియా కమిటీ లో మెజార్టీ సభ్యులుగా ఉన్న టి యు డబ్ల్యూ జే ఐజేయు తీసుకుంటుందని వివరించారు. అలాగే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇండ్లు, ఇండ్ల స్థలాల విషయంలో రాష్ట్ర యూనియన్ నాయకత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని, అందుకు అనుగుణంగా సూర్యాపేట జిల్లాలో కూడా అర్హులైన జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు, ఇండ్లు, ఇళ్ల స్థలాలు అందజేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో త్వరలోనే జిల్లాలోని జర్నలిస్టులకు వృత్తిపరంగా నైపుణ్యం పెంపొందించే విధంగా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు.. జిల్లాలో చేపట్టిన యూనియన్ సభ్యత్వ నమోదుకు జర్నలిస్టుల నుంచి భేషైన స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు

సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ బంటు, సీనియర్ జర్నలిస్టులు షేక్ రషీద్, గుడిపూడి రామకృష్ణ, తండు వెంకన్న, కందుకూరి యాదగిరి, షేక్ జహీర్, కొండ్లె కృష్ణయ్య, సురేందర్, రామచంద్ర రాజు, దుస్సా చంద్రశేఖర్, దుర్గం బాలు, పోలోజు సందీప్, వెంకట్, మధు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

టీయూడబ్ల్యూజే ఐజేయు ఎల్లప్పుడూ జర్నలిస్టుల పక్షమే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News