Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:54 AM

టీపీటీఎఫ్ జిల్లా నూతన అధ్యక్షుడిగా బండారు శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక

07-06-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తెలంగాణ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (టీపీటీఎఫ్) జిల్లా కార్యవర్గ సమావేశంలో బండారు శ్రీనివాస్‌ను జిల్లా నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

జిల్లా అధ్యక్షుడు రాపర్తి రామ నరసయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉపాధ్యాయ సంఘ బలోపేతం, కొత్త విద్యా సంవత్సర సభ్యత్వ నమోదు కార్యక్రమంపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం 27 వేల పాఠశాలలను 4 వేల పాఠశాలలుగా కుదించాలనే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది. ఈ నిర్ణయం అమలైతే గ్రామీణ ప్రాంతాల నిరుపేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

అనంతరం జరిగిన ఎన్నికల్లో బండారు శ్రీనివాస్‌ను జిల్లా నూతన అధ్యక్షుడిగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, సంఘ నిర్మాణ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. టీపీటీఎఫ్ సంఘ భవన నిర్మాణం కోసం అందరి సహకారంతో పనిచేస్తానని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం అలాగే సామాజిక అంశాలపై జరిగే పోరాటాల్లో తన వంతు పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్ భిక్షం, జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరన్న, మాజీ అధ్యక్షుడు పుప్పాల రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బడుగుల సైదులు, ఏ. హనుమంతరావు, చిరుగాని యాకయ్య, కార్యదర్శులు ఎల్. పెద్ది సుధాకర్ రెడ్డి, నల్ల చంద్రారెడ్డి, జిల్లా జానయ్య, పోతురాజు నరసయ్య, పోలిశెట్టి శ్రీనివాస్, దామెర్ల లాలయ్య, పూసపల్లి మల్లయ్య, తన్నీరు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

టీపీటీఎఫ్ జిల్లా నూతన అధ్యక్షుడిగా బండారు శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News