Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి కృషితోనే చౌటుప్పల్‌కు అదనపు కోర్టు మంజూరు పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 11:21 AM

టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన బండారు శ్రీనివాస్‌కు ఘన సన్మానం

టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన బండారు శ్రీనివాస్‌కు ఘన సన్మానం

టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన బండారు శ్రీనివాస్‌కు ఘన సన్మానం
June 07, 2026 08:19 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తెలంగాణ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (టీపీటీఎఫ్) జిల్లా నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బండారు శ్రీనివాస్‌ను మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ప్రముఖ విద్యావేత్త కాసర్ల వీరారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా కక్కిరేణి శ్రీనివాస్ మాట్లాడుతూ, బండారు శ్రీనివాస్ నాయకత్వంలో టీపీటీఎఫ్ సంఘం మరింత బలోపేతం అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సంఘ భవన నిర్మాణం పూర్తి చేసేందుకు ఆయన కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

నూతన అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, సంఘం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు. టీపీటీఎఫ్ సంఘ భవన నిర్మాణానికి తన వంతు సహకారం అందించడంతో పాటు, సభ్యులందరి సహకారంతో త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక సమస్యల పరిష్కారానికి కూడా సంఘం తరఫున నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై బండారు శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల హక్కుల సాధనకు సమిష్టిగా పోరాడి సమస్యలను పరిష్కరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రమేష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రమణ, వీరయ్య, కృష్ణంరాజు, పిన్నెల్లి వెంకటేష్, ప్రభాకర్, రమేష్, అశోక్, రేవన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News