Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:53 AM

తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే రక్షణ కవచం: జగదీశ్ రెడ్డి

02-06-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు.

సమైక్య పాలనలో నిరాదరణకు గురైన తెలంగాణను కేసీఆర్ నాయకత్వంలో కేవలం 12 ఏళ్ల వ్యవధిలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఒకప్పుడు తెలంగాణ యాస మాట్లాడితే పనులు కావని ప్రజలు భయపడే పరిస్థితిని ఆంధ్ర పాలకులు సృష్టించారని గుర్తుచేశారు. ఎన్నో కుట్రలను ఎదుర్కొని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని తెలిపారు.

వ్యవసాయం, పాడి పరిశ్రమ, మాంస ఉత్పత్తుల రంగాల్లో తెలంగాణను ముందంజలో నిలబెట్టిన ఘనత కేసీఆర్‌దేనని జగదీశ్ రెడ్డి అన్నారు. మార్పు పేరుతో అసత్య హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటోందని విమర్శించారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉండటం విచారకరమన్నారు.

బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకుని ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులకు అశోక్‌నగర్‌లో హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పుడు అక్కడికి వెళ్లేందుకు ఎందుకు వెనుకాడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సమైక్య పాలనలో జరిగిన జలవనరుల అన్యాయం మళ్లీ పునరావృతమవుతోందని, రాష్ట్రంలో ఆంధ్ర ఉద్యోగ సంఘాల నేతల పెత్తనం పెరిగిందని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు పనిచేస్తున్నారని విమర్శించారు.

అంతకుముందు తెలంగాణ తల్లి, తెలంగాణ అమరవీరుల చిత్రపటాలకు జగదీశ్ రెడ్డి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే రక్షణ కవచం: జగదీశ్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News