Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మణికంఠనగర్‌లో వైభవంగా మద్దెలమ్మ బోనాలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:02 PM

తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశభక్తి నినాదాలతో వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం కల్పించిన మహాగ్రంథమని అన్నారు. ఆ రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజల పక్షాన నిలబడి పోరాడటమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.దేశ స్వాతంత్ర్యాన్ని సాధించిన మహానీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, రాజ్యాంగ ఆత్మను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడిపై ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, చాంద్ భాయ్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు పాల్గొన్నారు.అలాగే పెన్పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, వల్లాల సైదులు, శుంకరబోయిన రాజు, లింగాల సైదులు, బోడపట్ల మధు, అనపర్తి రాజేష్, కడియం వంశీ, మామిడి ఉదయ్, మామిడి శోభన్, నెలచర్ల మధు ప్రజాప్రతినిధి తదితర నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ ఐక్యత, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని పిలుపునిస్తూ కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు.

Sthanikam

తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News