Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:48 AM

సూర్యాపేటకు “ఫ్రెష్ బ్రాండ్” – ఆయిల్ ఫామ్ సాగుతో రైతుల అభివృద్ధి

24-04-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లాలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి, రైతులకు అధిక ఆదాయం వచ్చేలా “సూర్యాపేట ఫ్రెష్ బ్రాండ్”ను రూపుదిద్దాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక స్టార్ బ్యాంకెట్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయిల్ ఫామ్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే పంటలను రైతులు ఎంచుకోవాలని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగు ద్వారా రైతులు ఆర్థికంగా బలపడే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు ప్రత్యేక సబ్సిడీలు అందిస్తున్నదని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఎన్‌ఎంఈఓ-ఓపీ పథకం కింద మొక్కలు, ఎరువులు, బిందు సేద్య పరికరాల కోసం మొదటి నాలుగు సంవత్సరాల్లో రూ.50,918 వరకు రాయితీ లభిస్తుందని తెలిపారు. ఒక్కో మొక్కకు రైతులు రూ.20 చొప్పున తమ వంతు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.జిల్లాలో ఆయిల్ ఫామ్ కంపెనీలు నర్సరీల ద్వారా మొక్కలు సరఫరా చేసి, సాంకేతిక సహాయం అందిస్తాయని, పంటను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసి 14 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాయని వివరించారు. తుంగతుర్తిలో తానే 25 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నానని తెలిపారు.

పంటలకు సరైన మార్కెట్ కల్పించేందుకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని, త్వరలో 15 ఎకరాల్లో మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కోటపహాడ్ గ్రామంలో రైతుల అభ్యర్థన మేరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించినట్లు తెలిపారు.

2012 నుంచి హైదరాబాద్ హయత్‌నగర్‌లో డైరీ ఫామ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాసం లింగా రెడ్డి, వైస్ చైర్మన్ పంతంగి మల్సూర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోతి గోపాల్ రెడ్డి, తూముల సురేష్ రావు, ధారవత్ వీరన్న నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, హార్టికల్చర్ అధికారి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేటకు “ఫ్రెష్ బ్రాండ్” – ఆయిల్ ఫామ్ సాగుతో రైతుల అభివృద్ధి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News