Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:06 AM

సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్‌గా మొరిశెట్టి నివేదిత–లక్ష్యాది బాధ్యతల స్వీకారం

27-02-2026 161 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వేద మంత్రాలతో ఆశీర్వాదం… భారీగా తరలివచ్చిన కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు

సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్‌గా మొరిశెట్టి నివేదిత–లక్ష్యాది పదవి బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వేద పండితులు వేదమంత్రాల మధ్య ఆశీర్వాదం అందజేశారు. నూతన చైర్పర్సన్‌కు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత–లక్ష్యాది మాట్లాడుతూ ఐదేళ్ల పాలనకు అందరూ అండగా ఉండాలని కోరారు. పట్టణ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యతల స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన కౌన్సిలర్లు, అధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి తొలి సంతకంగా 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. సూర్యాపేట పట్టణ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలోని 48 వార్డుల్లో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ముఖ్యంగా పరిశుభ్రత సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. మున్సిపాలిటీలో విలీనం అయినప్పటికీ శివారు ప్రాంతాలు ఇంకా గ్రామాల రూపంలోనే ఉన్నాయని, అక్కడి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Sthanikam

సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్‌గా మొరిశెట్టి నివేదిత–లక్ష్యాది బాధ్యతల స్వీకారం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News