Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చి.. కుమారుడిని కోల్పోయిన తల్లి! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 05:09 PM

సూర్యాపేట జిల్లాకు ధర్మభిక్షం పేరు పెట్టాలి

15-02-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు డిమాండ్

సూర్యాపేట తొలి శాసనసభ్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు బొమ్మగాని ధర్మభిక్షం పేరును సూర్యాపేట జిల్లాకు నామకరణం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని ధర్మభిక్షం భవనంలో పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన 104వ జయంతి ఉత్సవాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ధర్మభిక్షం సూర్యాపేట పట్టణంలో తొలి వసతిగృహాన్ని నిర్మించి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి చైతన్యవంతులను చేసి అనేక రంగాల్లో తీర్చిదిద్దిన మహానేత అని కొనియాడారు.జిల్లాలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, సాగు, త్రాగునీటి సమస్యలపై అనేక పోరాటాలు చేసి ప్రజలకు న్యాయం సాధించిన నాయకుడు ధర్మభిక్షం అని పేర్కొన్నారు. దళిత, పీడిత, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన ప్రజానాయకుడిగా ఆయనను స్మరించారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ధర్మభిక్షం జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని, హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, మహానేత జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్మభిక్షం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన ఘన నివాళి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు బొమ్మగాని శ్రీనివాస్, దంతాల రాంబాబు, చామల అశోక్ కుమార్, దోరేపల్లి శంకర్, సీనియర్ జర్నలిస్ట్ డేగల జనార్ధన్, ప్రజా అభియోగాధికారి నాతి సవేందర్ కుమార్, మాజీ కౌన్సిలర్ అనంతల మల్లేశ్వరి, చివ్వెంల మండల కార్యదర్శి ఖమ్మంపాటి రాము, సీనియర్ న్యాయవాది తలమల్ల హస్సేన్, శాంతి సంఘం జిల్లా అధ్యక్షుడు తొగటి మురళి, గుగులోతు రాజారాం, యువ నాయకులు బూర సైదులు, ఎడెల్లి శ్రీకాంత్, మహిళ నాయకురాలు దంతాల పద్మరేఖ, దేశగాని హేమలత, రిక్షా సంఘం నాయకులు పెన్డ్రా కృష్ణ, వాడపల్లి వెంకన్న, బాబు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేట జిల్లాకు ధర్మభిక్షం పేరు పెట్టాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News