Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:47 AM

సూర్యాపేట బస్టాండ్‌లో మరుగుదొడ్ల కష్టాలు

05-05-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో ప్రయాణికులు మరుగుదొడ్ల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్‌లో మహిళలకు కేటాయించిన మరుగుదొడ్లు మరమ్మతుల కారణంగా మూసివేయడంతో, ప్రత్యామ్నాయంగా పురుషుల విభాగాన్ని మహిళలకు కేటాయించారు. దీంతో పురుష ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇక సరైన నిర్వహణ లేకపోవడంతో మరుగుదొడ్ల వద్ద దుర్వాసన వ్యాపిస్తుండగా, మహిళలు కూడా ఉపయోగించడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. శుభ్రత లోపం, నీటి సౌకర్యాల కొరత కారణంగా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా, బస్టాండ్ ఎదురుగా ఉన్న పే అండ్ యూస్ మరుగుదొడ్లు కూడా మూసివేయబడటంతో యువత, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో ఉపయోగించుకునే సౌకర్యం లేకపోవడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరుగుదొడ్లను మరమ్మతు చేయించడంతో పాటు శాశ్వత పరిష్కారం కల్పించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. బస్టాండ్ వంటి ప్రజా ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని ప్రజలు సూచిస్తున్నారు.

Sthanikam

సూర్యాపేట బస్టాండ్‌లో మరుగుదొడ్ల కష్టాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News