Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:35 AM

సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

24-03-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.

మంగళవారం మోత్కూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు. పప్పులు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను తనిఖీ చేశారు. అన్నం సరిగా వండకపోతే వెంటనే సంబంధిత అధికారికి సమాచారం ఇచ్చి బియ్యం మార్చుకోవాలని సూచించారు. నాణ్యత ప్రమాణాల్లో ఎలాంటి రాజీ ఉండకూడదని సిబ్బందికి స్పష్టం చేశారు.

విద్యార్థులకు సరిపడా భోజనం, పాలు సమయానికి అందుతున్నాయా అని ఆరా తీశారు. వంటగదిలో తయారైన ఆహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, శుభ్రతతో పాటు రుచికరమైన భోజనం అందించాలన్నారు. పాఠశాల పరిసరాల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి పరీక్షలపై వారి సన్నద్ధతను తెలుసుకున్నారు. ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ తనిఖీలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News