Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

సోషల్ మీడియా వేధింపులపై ఆగ్రహం.. బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారని చిరుమర్తి లింగయ్య విమర్శ

20-05-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, తమపై వ్యక్తిగత దూషణలు చేస్తూ అసత్య ప్రచారం నిర్వహిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు ప్రతిగా వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ సోషల్ మీడియాలో స్పందించిన తన వ్యక్తిగత సహాయకుడు (పిఏ) సందీప్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని విమర్శించారు.సోషల్ మీడియాలో మొదటగా అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, వాటికి సమాధానం ఇచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకోవడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.

స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఒత్తిడితోనే బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించేప్రయత్నాలుజరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచే హక్కు ఉందని, రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసులను అడ్డుపెట్టుకుని భయపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు.వెంటనే సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులపై చర్యలు తీసుకుని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

Sthanikam

సోషల్ మీడియా వేధింపులపై ఆగ్రహం.. బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారని చిరుమర్తి లింగయ్య విమర్శ

Article Image

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, తమపై వ్యక్తిగత దూషణలు చేస్తూ అసత్య ప్రచారం నిర్వహిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు ప్రతిగా వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ సోషల్ మీడియాలో స్పందించిన తన వ్యక్తిగత సహాయకుడు (పిఏ) సందీప్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని విమర్శించారు.సోషల్ మీడియాలో మొదటగా అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, వాటికి సమాధానం ఇచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకోవడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.

స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఒత్తిడితోనే బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించేప్రయత్నాలుజరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచే హక్కు ఉందని, రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసులను అడ్డుపెట్టుకుని భయపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు.వెంటనే సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులపై చర్యలు తీసుకుని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News