Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 01:36 AM

సూర్యాపేట అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం

07-02-2026 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

42, 27వ వార్డుల్లో జోరుగా ఎన్నికల ప్రచారం

సూర్యాపేట: సూర్యాపేట పట్టణ అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 42వ వార్డు అభ్యర్థి చల్లమల్ల నరసింహ, 27వ వార్డు అభ్యర్థి కుంచం దుర్గ గెలుపుకోసం ఆయన ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 27వ వార్డులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1995 నుంచి 2005 మధ్య కాలంలో పట్టణంలో నిర్మించిన సిసి రహదారులు, బిటి రహదారులు, కృష్ణా జలాల సరఫరానే నేటికీ సూర్యాపేట అభివృద్ధికి బలమైన ఆధారంగా నిలుస్తున్నాయని తెలిపారు. గత పాలకులు పట్టణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వ నిధులతో సూర్యాపేటను రెట్టింపు స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి 42వ వార్డు అభ్యర్థి చల్లమల్ల నరసింహ, 27వ వార్డు అభ్యర్థి కుంచం దుర్గలను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు.

Sthanikam

సూర్యాపేట అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News