Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:41 AM

సంక్షేమ హాస్టల్‌పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనురాగ్ జయంతి

28-03-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోత్కూర్,

సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శనివారం మోత్కూర్ మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

హాస్టల్‌లో విద్యార్థుల వసతులు, హాజరు వివరాలు, ఉపాధ్యాయుల విధులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు హాస్టల్‌లోనే ఉంటున్నారా అనే విషయాన్ని పరిశీలించారు. తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతిరోజూ శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందుతున్నదా అని స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిచెన్ రూమ్, స్టోర్ రూమ్‌లను పరిశీలించి, వంట సామగ్రి, కూరగాయలు, పప్పులు, ధాన్యాలు, గుడ్లు, నూనె నాణ్యతను పరిశీలించారు. నాణ్యమైన వంట సరుకులు, తాజా కూరగాయలు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా హిమేష్ అనే విద్యార్థితో మాట్లాడి, చదువు, భవిష్యత్ లక్ష్యాలపై ఆరా తీశారు. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు.

Sthanikam

సంక్షేమ హాస్టల్‌పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనురాగ్ జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News