Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:59 PM

సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు వేగం.. త్వరలో ప్రారంభోత్సవం

03-05-2026 322 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి పట్టణం మరియు పరిసర పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది కార్మికులకు త్వరలో ఈఎస్ఐ డిస్పెన్సరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి వినతి మేరకు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి డిస్పెన్సరీని మంజూరు చేశారు. బైపాస్ రోడ్డులో ఎంపీడీవో కార్యాలయం పక్కన ఉన్న వినియోగంలో లేని ఆర్ అండ్ బి క్వార్టర్స్‌లో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, భవన మరమ్మత్తుల కోసం జగ్గారెడ్డి తన స్వంత నిధుల నుంచి రూ.8 లక్షలు అందించారు. ప్రస్తుతం మరమ్మత్తు పనులు కొనసాగుతుండగా, 10 పడకలు, 20 మంది సిబ్బందితో డిస్పెన్సరీని సిద్ధం చేస్తున్నారు. అవసరమైన ల్యాబ్, మందులు, వైద్య సదుపాయాల ఏర్పాటుపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సంగారెడ్డి పరిసర పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు సమీపంలోనే వైద్యసేవలు అందించడంలో ఈ డిస్పెన్సరీ ఎంతో ఉపయోగపడనుందని నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు. మరమ్మత్తు పనులు పూర్తి కాగానే మంత్రి వివేక్ వెంకట స్వామి, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Sthanikam

సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు వేగం.. త్వరలో ప్రారంభోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News