Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:01 AM

సి.వి. రామన్ స్ఫూర్తితో విద్యార్థులు రాణించాలి

28-02-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఘన కార్యక్రమం

శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశ ఔనత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన సి.వి. రామన్ స్ఫూర్తితో విద్యార్థులు పరిశోధనల్లో రాణించి కొత్త ఆవిష్కరణలు చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి పేర్కొన్నారు. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్ ఎల్ ఎస్ స్కాలర్ స్కూల్ లో ప్రిన్సిపల్ చికూరి సాయి కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఉపాధ్యక్షుడు షఫీ ఉల్లా తో కలిసి సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన విజ్ఞాన ప్రదర్శనలను పరిశీలించి అభినందించారు. మారుతున్న కాలానుగుణంగా విజ్ఞాన శాస్త్రంపై దృష్టి సారించి పరిశోధనాత్మక ఆలోచనలను పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల సృజనాత్మకత అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ చిలుముల సునీల్ రెడ్డి, నాయిని వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు విజయ శ్రీ, కరుణాకర్, సైదులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సి.వి. రామన్ స్ఫూర్తితో విద్యార్థులు రాణించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News