Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:00 AM

సిర్గాపూర్‌లో బాలల భద్రతపై భరోసా సెంటర్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం

30-04-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఆదేశాల మేరకు సంగారెడ్డి భరోసా సెంటర్ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండల కేంద్రంలో గురువారం బాలల భద్రత, చైల్డ్ సేఫ్టీ, యువత అభివృద్ధిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మీ మాట్లాడుతూ సమాజంలో లింగ సమానత్వం పాటించాలని, ఆడ–మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవించాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల బాలికలు శారీరక, మానసిక, సామాజిక సమస్యలు ఎదుర్కొంటారని వివరించి, అలాంటి వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. బాలలపై లైంగిక వేధింపులు, దాడుల నివారణకు పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంటూ, సెక్షన్ 19 ప్రకారం ఇటువంటి ఘటనల సమాచారాన్ని తప్పనిసరిగా అధికారులకు తెలియజేయాలని చెప్పారు. బాధితులు మౌనం వీడి ధైర్యంగా ఫిర్యాదు చేస్తేనే న్యాయం జరిగి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను అరికట్టవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డైల్ 100, మహిళా హెల్ప్‌లైన్ 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, జిల్లా భరోసా సెంటర్ నెంబర్ 8712656773లను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, సదాశివపేట సీఐ వెంకటేశ్, భరోసా సిబ్బంది, స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

సిర్గాపూర్‌లో బాలల భద్రతపై భరోసా సెంటర్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News