Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:41 AM

సిపిఎం నాయకుడు బైకాని నరసింహ మృతి – గ్రామంలో విషాదం, కుటుంబానికి ఆర్థిక సాయం

28-03-2026 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని పల్లివాడ గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సిపిఎం పార్టీ నాయకుడు బైకాని నరసింహ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ నరసింహ కుటుంబ సభ్యులను పరామర్శించి తన సంతాపాన్ని తెలిపారు.

ఈ సందర్భంగా నరసింహ సిపిఎం పార్టీకిచ్చిన సేవలను సర్పంచ్ గుర్తు చేశారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే మంచి నాయకుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, పార్టీ కార్యకర్తల సహకారంతో రూ.37 వేల ఆర్థిక సహాయాన్ని నరసింహ కుటుంబానికి అందజేశారు.

భవిష్యత్తులో కూడా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నరసింహ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో నాంపల్లి లింగయ్య (మాజీ ఉపసర్పంచ్), దండిగ నాగరాజు, కంకణాల శేఖర్ రెడ్డి, గడ్డం యాదగిరి, నాంపల్లి నరసింహ, బెజ్జంకి శంకరాచారి, మేకల లింగయ్య, కల్లూరి శ్రీనివాస్, తోటకూరి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సిపిఎం నాయకుడు బైకాని నరసింహ మృతి – గ్రామంలో విషాదం, కుటుంబానికి ఆర్థిక సాయం

Article Image

రామన్నపేట: మండలంలోని పల్లివాడ గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సిపిఎం పార్టీ నాయకుడు బైకాని నరసింహ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ నరసింహ కుటుంబ సభ్యులను పరామర్శించి తన సంతాపాన్ని తెలిపారు.

ఈ సందర్భంగా నరసింహ సిపిఎం పార్టీకిచ్చిన సేవలను సర్పంచ్ గుర్తు చేశారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే మంచి నాయకుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, పార్టీ కార్యకర్తల సహకారంతో రూ.37 వేల ఆర్థిక సహాయాన్ని నరసింహ కుటుంబానికి అందజేశారు.

భవిష్యత్తులో కూడా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నరసింహ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో నాంపల్లి లింగయ్య (మాజీ ఉపసర్పంచ్), దండిగ నాగరాజు, కంకణాల శేఖర్ రెడ్డి, గడ్డం యాదగిరి, నాంపల్లి నరసింహ, బెజ్జంకి శంకరాచారి, మేకల లింగయ్య, కల్లూరి శ్రీనివాస్, తోటకూరి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News