Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 10:13 PM

సింగితం గ్రామ సర్పంచ్ నేతృత్వంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా

12-01-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ:రాయికోడ్ మండలం సింగితం గ్రామంలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవడానికి ఈ రోజు గ్రామ సర్పంచ్ కె. శ్రావణి నిరంజన్ ఆధ్వర్యంలో మహిళల కోసం "ముగ్గుల పోటీలు"నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయికోడ్ ఎస్ఐ చైతన్య కిరణ్, రాయికోడ్ వలస అధికారి సారిక హాజరయ్యారు. వారు గ్రామ మహిళల రూపొందించిన రంగురంగుల ముగ్గులను పరిశీలించి, వారి సృజనాత్మకతను మరియు ప్రతిభను మెచ్చుకున్నారు. పండుగ సందర్భంగా ఇలాంటి పోటీలను నిర్వహించడం వలన మన సంస్కృతి, సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు నిలువనిచ్చే అవకాశం ఉంటుందని, మహిళల్లో సామాజిక మరియు సృజనాత్మక ఉత్సాహాన్ని నింపుతుందని ముఖ్య అతిథులు అభిప్రాయపడ్డారు.గ్రామ సర్పంచ్ కె. శ్రావణి నిరంజన్ తెలిపారు, "సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళల కోసం ఈ పోటీలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. గ్రామస్తులందరూ ఉత్సాహంగా పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది." న్యాయ నిర్ణయకర్తలుగా AO సారిక, జెహెచ్పీఎస్ తెలుగు ఉపాధ్యాయుడు యాదయ్య, AEO అర్చన, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ చారి వ్యవహరించారు.విజేతలకు అందించే బహుమతులను సర్పంచ్ మరియు శ్రీమతి కె. అశ్విని జగన్నాథ్ అందజేశారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహేష్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ చారి, BRS యువ నాయకులు పి. ప్రసాంత్ పాటిల్, వార్డు సభ్యులు డీ. ప్రభాకర్, కె. యాదమ్మ, ఎం. ప్రసాంత్, గ్రామ పెద్దలు మరియు గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం, విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచి, గ్రామస్తులందరిలో ఆనందాన్ని నింపింది

Sthanikam

సింగితం గ్రామ సర్పంచ్ నేతృత్వంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News