Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

సింగరేణి అధికారుల ఫిర్యాదుపై బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్

31-05-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నాంపల్లి కోర్టు ఆదేశాలు.. చంచల్‌గూడ జైలుకు తరలింపు.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సింగరేణి అధికారుల ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరచగా, వాదనలు విన్న న్యాయస్థానం రిమాండ్‌కు ఆదేశించింది. అనంతరం ఆయనను చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.

సింగరేణి అధికారులపై విధి నిర్వహణలో ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 326(g), 351(3), 353(1)(b), 55, 61(2)(a)తో పాటు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ప్రివెన్షన్ యాక్ట్ (PDPPA) సెక్షన్ 4 కింద అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు.కేసు దర్యాప్తు కొనసాగుతోందని, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

సింగరేణి అధికారుల ఫిర్యాదుపై బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News