Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:29 AM

తెలంగాణ వచ్చిందే.. కానీ ఆశయాలు నెరవేరాయా...?.ఉద్యమకారుల హక్కుల సాధనకు సమాయత్తం కావాలి: బత్తుల సోమయ్య

31-05-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటం అవసరం

ఖమ్మం,

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం కేవలం భౌతిక తెలంగాణ సాధన కోసమే కాదని, సామాజిక తెలంగాణ నిర్మాణమే అసలు లక్ష్యమని తెలంగాణ ఉద్యమకారుడు బత్తుల సోమయ్య అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం దాటినా ఉద్యమకారుల ఆకాంక్షలు, ప్రజల కలలు పూర్తిస్థాయిలో నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ప్రత్యేక అస్తిత్వం, సంస్కృతి, హక్కులకు భంగం కలిగిందని పేర్కొన్నారు. ఆ అన్యాయాలకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చిందని చెప్పారు. ఉద్యోగాలు, నిధులు, నియామకాలు, నీటి హక్కుల కోసం సాగిన పోరాటంలో వేలాది మంది ఉద్యమకారులు పాల్గొనగా, 1200 మందికి పైగా యువకులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తులు కీలక పదవులు అనుభవిస్తుండగా, తెలంగాణ కోసం పోరాడిన వారిని విస్మరించడం బాధాకరమన్నారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సంక్షేమంపై ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఆరోపించారు.

సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల సాధికారత, ఉద్యమకారుల హక్కుల సాధనే నిజమైన తెలంగాణ లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరోసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమించి హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలందరూ ఉద్యమకారులకు అండగా నిలిస్తేనే సామాజిక తెలంగాణ, బంగారు తెలంగాణ సాకారమవుతుందని బత్తుల సోమయ్య అభిప్రాయపడ్డారు.

Sthanikam

తెలంగాణ వచ్చిందే.. కానీ ఆశయాలు నెరవేరాయా...?.ఉద్యమకారుల హక్కుల సాధనకు సమాయత్తం కావాలి: బత్తుల సోమయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News