Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:12 PM

నెంబర్ ప్లేట్లు లేని 11 వాహనాలు సీజ్ నార్కెట్‌పల్లిలో పోలీసుల ప్రత్యేక తనిఖీలు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

31-05-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కెట్‌పల్లి, మే 30: నెంబర్ ప్లేట్లు లేకుండా రోడ్లపై సంచరిస్తున్న వాహనాలపై నార్కెట్‌పల్లి పోలీసులు ఉక్కుపాదం మోపారు. పట్టణ పరిధిలో శనివారం నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా సంచరిస్తున్న 11 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు.పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న ద్విచక్ర, ఇతర వాహనాలను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సంబంధిత వాహన యజమానులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా నార్కెట్‌పల్లి ఎస్సై విష్ణు మాట్లాడుతూ, ప్రతి వాహన యజమాని తమ వాహనాలకు చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.రోడ్డు భద్రత, నేర నియంత్రణ దృష్ట్యా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు భవిష్యత్తులో కూడా నిరంతరంగా కొనసాగుతాయని ఎస్సై తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.

Sthanikam

నెంబర్ ప్లేట్లు లేని 11 వాహనాలు సీజ్ నార్కెట్‌పల్లిలో పోలీసుల ప్రత్యేక తనిఖీలు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Article Image

నార్కెట్‌పల్లి, మే 30: నెంబర్ ప్లేట్లు లేకుండా రోడ్లపై సంచరిస్తున్న వాహనాలపై నార్కెట్‌పల్లి పోలీసులు ఉక్కుపాదం మోపారు. పట్టణ పరిధిలో శనివారం నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా సంచరిస్తున్న 11 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు.పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న ద్విచక్ర, ఇతర వాహనాలను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సంబంధిత వాహన యజమానులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా నార్కెట్‌పల్లి ఎస్సై విష్ణు మాట్లాడుతూ, ప్రతి వాహన యజమాని తమ వాహనాలకు చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.రోడ్డు భద్రత, నేర నియంత్రణ దృష్ట్యా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు భవిష్యత్తులో కూడా నిరంతరంగా కొనసాగుతాయని ఎస్సై తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News