Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సింగరేణి అధికారుల ఫిర్యాదుపై బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 10:33 AM

ఆరవ ఆదివారం వేడుకల్లో భక్తజన సంద్రంగా మారిన బోరంచ నల్లపోచమ్మ జాతర

ఆరవ ఆదివారం వేడుకల్లో భక్తజన సంద్రంగా మారిన బోరంచ నల్లపోచమ్మ జాతర

ఆరవ ఆదివారం వేడుకల్లో భక్తజన సంద్రంగా మారిన బోరంచ నల్లపోచమ్మ జాతర
May 31, 2026 09:18 AM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధి బోరంచ గ్రామ శివారులో స్వయంగా వెలసిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఏడు వారాల జాతర ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఆరవ ఆదివారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించగా, తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు ఎక్స్ ఆఫీస్ మెంబర్ శ్రీకాంత్ స్వామి, నాగేష్ స్వామి,ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలు, గంగాజలంతో మహాభిషేకం నిర్వహించి ప్రత్యేక కుంకుమార్చన పూజలు చేశారు. అనంతరం పసుపు, కుంకుమ తిలకం దిద్ది పట్టువస్త్రాలు సమర్పించి సుగంధ పుష్పాలతో అమ్మవారిని అందంగా అలంకరించారు. మహామంగళహారతులు సమర్పించి నైవేద్యాలు నివేదించగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు జాతరకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు బోనాలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆరవ ఆదివారం జాతరలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉండటంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. జిల్లాలో ప్రసిద్ధి చెందిన శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో భక్తితో మొక్కులు పెట్టిన వారి కోరికలు నెరవేరుతాయనే విశ్వాసంతో ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News