Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:53 AM

లంచం మత్తులో ‘సైబర్’ ఇన్‌స్పెక్టర్ రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహేందర్ సోదాల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాల స్వాధీనం

31-05-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ బత్తుల మహేందర్ లంచం కేసులో అరెస్టు కావడంతో పోలీసు శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటన అనంతరం ఆయన నివాసంలో నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు లభించడం సంచలనంగా మారింది.

ఈ నేపథ్యంలో మహేందర్‌కు సంబంధించిన ఆస్తుల వివరాలు, బ్యాంకు లావాదేవీలు, ఇతర పెట్టుబడులపై ఏసీబీ అధికారులు లోతైన విచారణ చేపట్టినట్లు సమాచారం. ఆయన గతంలో నిర్వహించిన విధులు, విచారించిన కేసులు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తున్న అధికారుల పనితీరుపై కూడా ఉన్నతాధికారులు సమీక్ష ప్రారంభించినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

లంచం కేసులో అరెస్టైన ఇన్స్పెక్టర్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం తెలంగాణ పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

లంచం మత్తులో ‘సైబర్’ ఇన్‌స్పెక్టర్ రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహేందర్ సోదాల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాల స్వాధీనం

Article Image

హైదరాబాద్: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ బత్తుల మహేందర్ లంచం కేసులో అరెస్టు కావడంతో పోలీసు శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటన అనంతరం ఆయన నివాసంలో నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు లభించడం సంచలనంగా మారింది.

ఈ నేపథ్యంలో మహేందర్‌కు సంబంధించిన ఆస్తుల వివరాలు, బ్యాంకు లావాదేవీలు, ఇతర పెట్టుబడులపై ఏసీబీ అధికారులు లోతైన విచారణ చేపట్టినట్లు సమాచారం. ఆయన గతంలో నిర్వహించిన విధులు, విచారించిన కేసులు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తున్న అధికారుల పనితీరుపై కూడా ఉన్నతాధికారులు సమీక్ష ప్రారంభించినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

లంచం కేసులో అరెస్టైన ఇన్స్పెక్టర్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం తెలంగాణ పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News