Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:03 AM

శివారు ప్రాంతాల కాలనీల అభివృద్ధికి కృషి

శివారు ప్రాంతాల కాలనీల అభివృద్ధికి కృషి

శివారు ప్రాంతాల కాలనీల అభివృద్ధికి కృషి
19-02-2026 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట పట్టణంలోని శివారు ప్రాంతాల కాలనీల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని మానస నగర్‌ (శ్రీ సాయి పట్టణ విస్తరణ ప్రాంతం)లో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కాలనీల్లో ఎదురవుతున్న సమస్యలను స్థానికుల నుంచి తెలుసుకున్నారు. పట్టణంలోని ప్రతి కాలనీలో సిమెంట్ రహదారులు, కాలువలు, తాగునీటి సదుపాయం మరియు ఇతర మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే పట్టణం సమగ్రంగా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. కాలనీ ప్రజల సహకారంతో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు కృషి నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శివారు ప్రాంతాల కాలనీల అభివృద్ధికి కృషి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News