Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:25 PM

శాంతియుతంగా శోభాయాత్రలు నిర్వహించండి – ఎస్పీ సూచనలు • సదాశివపేటలో శోభాయాత్ర

02-04-2026 259 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సదాశివపేట పట్టణంలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో జరగనున్న హనుమాన్ జయంతి శోభాయాత్ర మార్గాలను పరిశీలించి, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. శోభాయాత్ర ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అలాగే జిల్లా వ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో తగిన సంఖ్యలో పోలీస్ సిబ్బందిని మోహరించి భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.శోభాయాత్ర నిర్వాహకులు మరియు భక్తులు బాధ్యతతో వ్యవహరించాలని సూచిస్తూ, అధిక శబ్దాలతో డీజేలను వినియోగించకూడదని, ఇతర మతాల భావాలను దెబ్బతీసే విధంగా వివాదాస్పద పాటలు, నినాదాలు, ప్రసంగాలు ఉండకూడదని హెచ్చరించారు. ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, సహనంతో ప్రవర్తించాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే రూమర్లు, తప్పుడు ప్రచారాలను నమ్మరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఎవరైనా రూమర్లు ప్రచారం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట సదాశివపేట ఇన్స్పెక్టర్ డి. వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శాంతియుతంగా శోభాయాత్రలు నిర్వహించండి – ఎస్పీ సూచనలు • సదాశివపేటలో శోభాయాత్ర

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News