Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:18 AM

శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు… 13 రోజుల్లో రూ.5.61 కోట్లు!

21-02-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల అనంతరం స్వామి, అమ్మవార్ల హుండీ లెక్కింపును దేవస్థానం అధికారులు పూర్తి చేశారు.

గత 13 రోజులకు గాను స్వామివారికి మొత్తం రూ.5,61,81,535 నగదు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం వర్గాలు వెల్లడించాయి. చంద్రవతి కళ్యాణ మండపంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు అధికారికంగా ఆదాయ వివరాలను ప్రకటించారు.

నగదుతో పాటు భక్తులు బంగారం, వెండి ఆభరణాలను మొక్కుల రూపంలో సమర్పించారు. స్వామి అమ్మవార్లకు 124.5 గ్రాముల బంగారం, 5.550 కేజీల వెండి సమకూరినట్లు అధికారులు తెలిపారు.

భారతీయ కరెన్సీతో పాటు విదేశీ భక్తులు కూడా తమ భక్తిని చాటుకున్నారు. హుండీలో 22 అమెరికా డాలర్లు, 25 ఇంగ్లాండ్ పౌండ్లు, 15 ఆస్ట్రేలియా డాలర్లు, సింగపూర్ డాలర్లు, యూరో కరెన్సీలు లభించినట్లు వెల్లడించారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల విజయవంత నిర్వహణతో పాటు భారీ ఆదాయం రావడం పట్ల దేవస్థానం అధికారులు ఆనందం వ్యక్తం చేశారు.

Sthanikam

శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు… 13 రోజుల్లో రూ.5.61 కోట్లు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News