Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:20 PM

శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో లారీ ఓనర్లకు, డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య శిబిరం

శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో లారీ ఓనర్లకు, డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య శిబిరం

శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో లారీ ఓనర్లకు, డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య శిబిరం
April 06, 2026 07:28 PM 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ 50 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని, తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ రవాణా వాహన రంగంలో ఉన్న లారీ యాజమాన్యాలు, డ్రైవర్ల శ్రేయస్సు కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. సోమవారం కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్‌లో నిర్వహించిన శ్రీ ‘ఆరంభం వెహికల్ లోన్స్’(ఢిల్లీ నుండి దిండిగల్) కార్యక్రమంలో భాగంగా భారీ ఉచిత ఆరోగ్య పరీక్షలు, ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరానికి పెద్ద సంఖ్యలో లారీ డ్రైవర్లు, యాజమాన్యాలు హాజరై సేవలు పొందారు.

ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలాని కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని, డ్రైవర్లు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

అలాగే ఆయుష్మాన్ భారత్ కార్డులు, శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ అందిస్తున్న వివిధ రుణ పథకాలు, బీమా సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు డ్రైవర్లకు అవసరమైన సలహాలు అందిస్తూ, సంస్థ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ హమ్‌జా హలీ, జోనల్ బిజినెస్ హెడ్ మహిపాల్ రెడ్డి, స్టేట్ హెడ్ ప్రదీప్, రీజనల్ మేనేజర్ రామారావు, బ్రాంచ్ మేనేజర్లు శ్రీనివాస్, శ్రవణ్, శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News