Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:41 AM

శ్రీ హిందూ డిగ్రీ కళాశాలలో డ్రగ్‌రహిత తెలంగాణ ప్రతిజ్ఞ. విద్యార్థుల్లో అవగాహనకు ఎక్సైజ్ శాఖ చొరవ

28-03-2026 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శ్రీ హిందూ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన డ్రగ్‌రహిత తెలంగాణ కార్యక్రమం విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపింది. మాదకద్రవ్యాల ముప్పు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఎక్సైజ్ సీఐ బాలాజీ నాయక్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రిన్సిపల్ భాస్కరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించినట్లు చెప్పారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగంపై జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ క్రియాశీలంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై పూర్తి అవగాహనతో ఉండి, తమతో పాటు ఇతరులను కూడా ఈ వ్యసనానికి దూరంగా ఉంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. డ్రగ్స్ అమ్మకం–కొనుగోలు చేసే వారి సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందజేస్తామని, డ్రగ్‌రహిత జీవనశైలిని అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

డ్రగ్‌రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగస్వాములమవుతామని విద్యార్థులు సంకల్పం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆప్కారి ఎస్సై శంకర్, శివకృష్ణ, సిబ్బంది అనిల్ కుమార్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ హిందూ డిగ్రీ కళాశాలలో డ్రగ్‌రహిత తెలంగాణ ప్రతిజ్ఞ. విద్యార్థుల్లో అవగాహనకు ఎక్సైజ్ శాఖ చొరవ

Article Image

శ్రీ హిందూ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన డ్రగ్‌రహిత తెలంగాణ కార్యక్రమం విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపింది. మాదకద్రవ్యాల ముప్పు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఎక్సైజ్ సీఐ బాలాజీ నాయక్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రిన్సిపల్ భాస్కరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించినట్లు చెప్పారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగంపై జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ క్రియాశీలంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై పూర్తి అవగాహనతో ఉండి, తమతో పాటు ఇతరులను కూడా ఈ వ్యసనానికి దూరంగా ఉంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. డ్రగ్స్ అమ్మకం–కొనుగోలు చేసే వారి సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందజేస్తామని, డ్రగ్‌రహిత జీవనశైలిని అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

డ్రగ్‌రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగస్వాములమవుతామని విద్యార్థులు సంకల్పం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆప్కారి ఎస్సై శంకర్, శివకృష్ణ, సిబ్బంది అనిల్ కుమార్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News