Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:33 AM

శాఖాహారం–ధ్యానం సందేశంతో నల్లగొండలో ర్యాలీ

23-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ,

శాఖాహారం, అహింస, ధ్యానం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తూ నల్లగొండ పట్టణంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో శ్రీ సద్గురు సదానంద పిరమిడ్, శ్రీ గణేష్ పిరమిడ్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా బోయవాడ ధ్యాన కేంద్రం నుంచి ఈ ర్యాలీ జరిగింది.

ఈ సందర్భంగా దామోదర్ మహాస్వామి, కడ్తాల్ పిరమిడ్ ట్రస్ట్ ప్రతినిధులు, భూపతిరాజు, భూసాని జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ అహింసా మార్గాన్ని అనుసరించడం ద్వారా ఆరోగ్యం, ఆనందం, మానసిక ప్రశాంతత సాధ్యమవుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ శాఖాహారాన్ని అలవాటు చేసుకొని జీవహింసకు దూరంగా ఉండాలని సూచించారు.

ధ్యాన సాధన వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, బీపీ, షుగర్, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయని వివరించారు. ధ్యానం ద్వారా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సాగర్ సతీష్‌బాబు, శివకుమార్‌తో పాటు పీఎంసీ కుటుంబ సభ్యులు, ధ్యాన సాధకులు పాల్గొన్నారు.

Sthanikam

శాఖాహారం–ధ్యానం సందేశంతో నల్లగొండలో ర్యాలీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News