Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:05 PM

సీవీ రామన్ స్ఫూర్తితో శాస్త్ర పరిశోధనల్లో రాణించాలి

10-03-2026 137 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

విద్యార్థులు సాంకేతికతతో ముందుకు సాగాలి : చైర్మన్ సిహెచ్ ప్రకాష్ రెడ్డి

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు సీవీ రామన్ స్ఫూర్తితో విద్యార్థులు పరిశోధనల్లో రాణించి కొత్త ఆవిష్కరణలకు ముందుకు రావాలని చైర్మన్ సిహెచ్ ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో ఉన్న సిటీ టాలెంట్ ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞానోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన శాస్త్ర ప్రదర్శనలను తిలకించి వారిని అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా విద్యార్థులు విజ్ఞానశాస్త్ర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. శాస్త్ర పరిశోధనల ద్వారా సమాజానికి ఉపయోగపడే కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు చేయాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో సిటీ ఎలైట్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి కిరణ్ కుమార్, సిటీ టాలెంట్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీధర్, న్యూ విజన్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుకృత రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీవీ రామన్ స్ఫూర్తితో శాస్త్ర పరిశోధనల్లో రాణించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News