తెలుగు సినీ రంగంలో విషాద ఛాయలు
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటుడు రఘునాథరెడ్డి శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.
నెల రోజుల క్రితమే ఆయన కుమారుడు గుండెపోటుతో మృతి చెందడంతో రఘునాథరెడ్డి తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన ఆయన, అదే బాధతో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.రఘునాథరెడ్డి తన సినీ జీవితంలో సుమారు మూడు వందల యాభైకి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ముఖ్యంగా సహాయ పాత్రలు, ప్రతినాయక పాత్రల్లో ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి