Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:42 AM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
01-06-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు కేతావత్ శంకర్ నాయక్ సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణంలోని 9వ వార్డు ఎన్టీఆర్ కాలనీకి చెందిన కలకోట్ల అఖిలకు రూ.50 వేల చెక్కును, సూర్యాపేట మండలం సపవత్ తండాకు చెందిన దేపవత్ రవీందర్ నాయక్‌కు రూ.29 వేల చెక్కును, సూర్యాపేట పట్టణంలోని 39వ వార్డు బొడ్రాయి బజార్‌కు చెందిన దేవరకొండ విజయకు రూ.28 వేల చెక్కును అందజేశారు.

ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయానికి లబ్ధిదారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌తో పాటు ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News