Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:58 PM

సీఎం పర్యటనకు సిద్ధమవుతున్న రాజీవ్ పార్క్.. పనులను పరిశీలించిన జగ్గారెడ్డి

సీఎం పర్యటనకు సిద్ధమవుతున్న రాజీవ్ పార్క్.. పనులను పరిశీలించిన జగ్గారెడ్డి

సీఎం పర్యటనకు సిద్ధమవుతున్న రాజీవ్ పార్క్.. పనులను పరిశీలించిన జగ్గారెడ్డి
April 27, 2026 08:15 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి పట్టణంలోని రాజీవ్ పార్క్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేసి మే 10లోగా ప్రధాన పనులు పూర్తి చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులను ఆదేశించారు. రూ.3 కోట్ల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పార్క్‌లో గ్రీనరీ, వాకింగ్ ట్రాక్, కాంపౌండ్ వాల్ నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి శంకుస్థాపన కార్యక్రమానికి సిద్ధం చేయాలని పేర్కొన్నారు. పార్క్ ప్రధాన ప్రవేశద్వారం వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, ప్రత్యేక ల్యాండ్‌స్కేప్ డిజైన్ ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న బ్లాక్ గ్రానైట్ స్థానంలో నూతన టైల్స్ అమర్చాలని సూచించారు. పాడైపోయిన మ్యూజిక్ ఫౌంటెన్ స్థానంలో ఆధునిక మ్యూజిక్ ఫౌంటెన్ ఏర్పాటు చేసి ప్రతిరోజూ సాయంత్రం పాటల సమన్వయంతో నడిచేలా చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ప్రస్తుతం మంజూరైన రూ.3 కోట్లు పునరుద్ధరణ పనులకు మాత్రమే సరిపోతాయని అధికారులు వివరించగా, మ్యూజిక్ ఫౌంటెన్‌తో పాటు 2D, 3D లేజర్ ఫౌంటెన్లు మరియు మిగిలిన అభివృద్ధి పనులకు సంబంధించిన పూర్తి ప్రతిపాదనలు బుధవారం లోగా సిద్ధం చేయాలని జగ్గారెడ్డి ఆదేశించారు. పార్క్‌లో నిర్మించనున్న కృత్రిమ పాండ్‌లో పెడల్ బోట్లు ఏర్పాటు చేసి, పాండ్ చుట్టూ సందర్శకుల కోసం బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే యువత కోసం ప్రత్యేక స్కేటింగ్ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రాకకు ముందే పార్క్ ముందు భాగంలోని పనులను పూర్తి చేసి సీఎం చేతుల మీదుగా ఫౌండేషన్ స్టోన్ వేయించేలా ఏర్పాట్లు చేయాలని జగ్గారెడ్డి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ డీఈ, నాయకులు తోపాజీ అనంత్ కిషన్, కూన సంతోష్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News