Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:01 AM

స్వీయ గణన ద్వారా కుటుంబ వివరాలు నమోదు చేసుకోండి: కలెక్టర్ ప్రతీక్ జైన్

03-05-2026 182 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) విధానం ద్వారా ప్రజలు తమ కుటుంబ వివరాలను తామే నమోదు చేసుకునే అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ ప్రక్రియ మే 10 వరకు కొనసాగుతుందని, జిల్లాలోని ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేయడం వల్ల సమయం ఆదా కావడంతో పాటు సమాచార ఖచ్చితత్వం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం https://se.census.gov.in⁠ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నంబర్, ఓటీపీ ధృవీకరణ అనంతరం జిల్లా, గ్రామం/పట్టణం, పిన్ కోడ్, లొకేషన్ వివరాలు నమోదు చేసి ఇళ్లకు సంబంధించిన 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి సబ్మిట్ చేయాలని తెలిపారు. సబ్మిట్ చేసిన తర్వాత లభించే 11 అంకెల సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడిని భద్రపరచుకోవాలని, మే 11 తర్వాత గణనాధికారి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడిని చూపించి ధృవీకరణ పొందవచ్చని వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించి తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ విజ్ఞప్తి చేశారు.

Sthanikam

స్వీయ గణన ద్వారా కుటుంబ వివరాలు నమోదు చేసుకోండి: కలెక్టర్ ప్రతీక్ జైన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News