Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:03 PM

స్వపరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా

స్వపరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా

స్వపరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా
13-03-2026 271 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

విద్యార్థులు వివిధ అధికారుల పాత్రల్లో ఆకట్టుకున్నారు

సూర్యాపేట టౌన్:

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్ వద్ద ఉన్న ఎస్‌వి‌ఎన్ పాఠశాలలో శుక్రవారం స్వపరిపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, పోలీస్ ఉన్నతాధికారులుగా, విద్యాధికారులుగా, ఉపాధ్యాయులుగా వివిధ పాత్రలు పోషిస్తూ కార్యక్రమాన్ని ఆసక్తికరంగా నిర్వహించారు. వారి ప్రతిభకు హాజరైనవారు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్. జగన్మోహన్ మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తేనే విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవచ్చని అన్నారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన ఆధారం అని తెలిపారు. జీవితంలో ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా విద్యతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

అనంతరం వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షీల్డులు, బహుమతులు అందజేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వహణాధికారి అనిత, ఉపాధ్యాయులు ఉమామహేశ్వరి, సుధా, జగదీశ్వరి, మౌనిక, పద్మలత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్వపరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News