నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో సోమవారం నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ వి ప్రశాంతి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా మున్సిపల్ వాహనాలకు మాత్రమే అందించాలని కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. చెత్తను రోడ్లపై వేయడం, డ్రైనేజీల్లో వ్యర్థాలు పడేయడం వల్ల వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్వచ్ఛ నారాయణఖేడ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ, నిబంధనలు ఉల్లంఘించి చెత్త వేస్తే జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వి ప్రశాంతి స్పష్టం చేశారు.
PRINT TIME: September 22, 2026 12:06 AM
స్వచ్ఛ నారాయణఖేడ్‌కు ప్రజల సహకారం అవసరం : మున్సిపల్ కమిషనర్ వి ప్రశాంతి

18-05-2026
95 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో సోమవారం నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ వి ప్రశాంతి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా మున్సిపల్ వాహనాలకు మాత్రమే అందించాలని కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. చెత్తను రోడ్లపై వేయడం, డ్రైనేజీల్లో వ్యర్థాలు పడేయడం వల్ల వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్వచ్ఛ నారాయణఖేడ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ, నిబంధనలు ఉల్లంఘించి చెత్త వేస్తే జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వి ప్రశాంతి స్పష్టం చేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి