Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:38 AM

స్థానిక సంస్థల్లో బీసీలకు 45 శాతం పైగా రిజర్వేషన్లు కల్పించాలి

11-05-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు పెంచి, కనీసం 45 శాతం పైగా రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పుట్టపర్తి లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బీసీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, ఐఏఎస్ (రిటైర్డ్) వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలు జనాభాలో దాదాపు 60 శాతం ఉన్నప్పటికీ, స్థానిక సంస్థల్లో తగిన రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు. గతంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 1983-94 అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 25 శాతం తీసుకొస్తే, అనంతరం 1994-2019ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 34 శాతం వరకు రిజర్వేషన్లు అమలులో ఉండేవని, అనంతరం 2019-24 లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాటిని 24 శాతానికి తగ్గించడం వల్ల గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో బీసీల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీలకు గతంలో ఉన్న రిజర్వేషన్లు పునరుద్ధరించడంతో పాటు, జనాభా నిష్పత్తిని పరిగణనలోకి తీసుకొని కనీసం 45 శాతం పైగా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అలాగే బీసీ కోటాలో ఎటువంటి కోతలు విధించకుండా రాజ్యాంగబద్ధ హక్కులను పరిరక్షించాలని, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా బీసీల సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. కేంద్ర NDA ప్రభుత్వం దేశవ్యాప్తంగా బీసీ సంక్షేమ శాఖను మరింత బలోపేతం చేసి, బీసీ జనాభా నిష్పత్తికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప్పర సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ , జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి వడ్డి హనుమన్న, లైవ్ స్టాక్ కార్పొరేషన్ డైరెక్టర్ యు.జి. వెంకటేశులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మరియు పెనుకొండ తెదేపా పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీరాములు యాదవ్,

మడకశిర మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఆర్. కంచెప్ప యాదవ్, జిల్లా JAC ప్రధాన కార్యదర్శి నాగప్ప వాల్మీకి, తెలుగు యువత కార్యదర్శి ఎం. చిక్కప్పయ్య మడకశిర తదితర NDA కూటమి నాయకులు, బీసీ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

స్థానిక సంస్థల్లో బీసీలకు 45 శాతం పైగా రిజర్వేషన్లు కల్పించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News