Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:13 AM

సాంస్కృతిక క్రీడోత్సవాలలో అద్భుతమైన ప్రదర్శనతో బహుమతులు గెలుచుకున్న వెంపటివిద్యార్థులు

సాంస్కృతిక క్రీడోత్సవాలలో అద్భుతమైన ప్రదర్శనతో బహుమతులు గెలుచుకున్న వెంపటివిద్యార్థులు

సాంస్కృతిక క్రీడోత్సవాలలో అద్భుతమైన ప్రదర్శనతో బహుమతులు గెలుచుకున్న  వెంపటివిద్యార్థులు
March 24, 2026 05:12 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో ఈనెల 21,22,23 తేదీలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మెరిసిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంపటి విద్యార్థులుక్రీడలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంపటి విద్యార్థులు తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందారు సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు సమాజానికి స్ఫూర్తినిచ్చిన మహనీయుల జీవితాలను వేదికపై ఆవిష్కరించారు. మాతా సావిత్రిబాయి పూలేజీవితం ఆధారంగా “అనగారిన జీవితాల్లో అక్షరధారి” పాటను హృద్యంగా ప్రదర్శించారు అదేవిధంగా “ఈ జెండా మనది” అనే దేశభక్తి గీతం ప్రజలను ఆలోచింప జేసిందిఏకపాత్రాభినయాల్లో విద్యార్థినులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన వీరనారుల పాత్రలను అద్భుతంగా పోషించారు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో గుండ్ల చరణ్య4వ తరగతి అద్భుత నటనతో ప్రధమ బహుమతి సాధించారు, రాణి రుద్రమదేవి పాత్రలో కొమ్ము అనుప్రియ4వ తరగతి ద్వితీయ బహుమతి అందుకున్నారు.అలాగే క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలేపాత్రలో రామనబోయిన సాత్విక 5వ తరగతి చక్కనిమాటలతో, అభినయంతో అందరి ప్రశంసలు పొందారుగ్రూప్ డాన్సు విభాగంలో విద్యార్థులు మూడవ స్థానంలో నిలిచి తృతీయ బహుమతి మెమొంటో,రెండు వేల రూపాయల నగదు బహుమతిని, సింగిల్ డాన్స్ విభాగంలో చిటుపాక నేహస్ర నాలుగవ తరగతి తృతీయ బహుమతి మెమొంటో, వెయ్యి రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని సాధించి పాఠశాలకు గౌరవాన్ని తీసుకొచ్చారుఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనర్సమ్మ మాట్లాడుతూ... మా పాఠశాల విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ ప్రతిభ చాటుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని అన్నారు విద్యార్థులకు తర్పీదు ఇచ్చిన కొరియోగ్రాఫర్ పాఠశాల ఉపాధ్యాయుడుమల్లెపాక రవీందర్ కృషిని ప్రత్యేక ంగా అభినందించి వారి సేవలను గుర్తుచేసుకున్నారు.అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలకు కొరియోగ్రఫీ చేసిన ఉపాధ్యాయుడు మల్లెపాక రవీందర్ మాట్లాడుతూ... పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం ఉపాధ్యాయులుగా మాబాధ్యతని చరిత్రలో నిలిచిన మహనీయుల జీవితాలను పిల్లలు వేదికపై ప్రదర్శించడం ద్వారా వారిలో నాయకత్వ లక్షణాలు,దేశభక్తి భావం,సామాజిక చైతన్యం పెరుగుతాయని ఈ విజయానికి కారణమైన ప్రతి విద్యార్థి కృషి అభినందనీయమని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరేలా శ్రమిస్తానని అన్నారు. విద్యార్థుల విజయం పట్ల తల్లిదండ్రులు,గ్రామస్థులు, యువజన సంఘాల సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం భీవనపల్లి శ్రీనివాస్,గట్టుమాధవి, నిమ్మరబోయిన నవీన,బండారు భవాని, జీడి అనిల్ కుమార్, మిట్టగడుపుల విక్రమ్, మాలోతుకృష్ణ, గుండ్ల ఆంజనేయులు, వాలంటీర్ లు రామనబోయినమౌనిక,అబ్బగాని మంజుల,శీలోజురమాదేవిని పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News