Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ సొంత నిధులతో సేవా కార్యక్రమం

19-03-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-తాజ్‌పూర్‌లో 120 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని తాజ్‌పూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేద ముస్లిం మైనారిటీ కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. సుమారు 120 కుటుంబాలకు ఈ తోఫాలు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పేద ముస్లిం కుటుంబాలు అధికంగా ఉండటంతో వారు పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఏ వర్గానికి చెందిన వారికైనా ఆపద వచ్చినప్పుడు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా తమ సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగేదని గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రంజాన్ తోఫా అందకపోవడం బాధాకరమని అభిప్రాయపడ్డారు.అదేవిధంగా,గ్రామంలోని ఓ ముస్లిం మహిళకు నివాసం లేకపోవడంతో దాదాపు లక్ష రూపాయలతో గృహ నిర్మాణం చేసి రంజాన్ రోజున గృహప్రవేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వరిగంటి కృష్ణ,వార్డు సభ్యులు,బీఆర్‌ఎస్ నాయకులు,ముస్లిం నాయకులు,గ్రామ పెద్దలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ సొంత నిధులతో సేవా కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News