Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:40 AM

సాంప్రదాయ వేడుకల మధ్య ఘనంగా వజ్రాల సత్య వీర బ్రహ్మాచారి దంపతుల షష్ఠిపూర్తి బంధుమిత్రులు, గ్రామ పెద్దల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య వేడుకలు

15-03-2026 117 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కవితలతో ఆకట్టుకున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఫిరంగి పుల్లయ్య

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల విద్యాశాఖాధికారి–2 వజ్రాల సత్య వీర బ్రహ్మాచారి, ఆయన సతీమణి విశ్వభారతి దంపతుల షష్ఠిపూర్తి మహోత్సవం వారి స్వగ్రామమైన చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దల సమక్షంలో సంప్రదాయ పద్ధతులతో నిర్వహించిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల నడుమ సాంప్రదాయ శోభను సంతరించుకున్నాయి.

వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ శుభకార్యక్రమంలో దంపతులు మరోసారి వివాహ బంధాన్ని గుర్తు చేసుకుంటూ పునర్వివాహ వేడుకలా ఆనందంగా పాల్గొన్నారు. గ్రామస్థులు, సన్నిహితులు దంపతులను పూలమాలలు, శాలువాలతో సత్కరించి వారి సేవలను ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో మండల పెద్ద దేశిరెడ్డి రాఘవరెడ్డి, చాట్రాయి మండల విద్యాశాఖాధికారి–1 మాసగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ విద్యా రంగంలో వజ్రాల సత్య వీర బ్రహ్మాచారి అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.

కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఫిరంగి పుల్లయ్య తన కవితా ప్రతిభను ప్రదర్శిస్తూ షష్ఠిపూర్తి దంపతులను ప్రశంసిస్తూ ప్రత్యేకంగా రచించిన పద్యాలను ఆలపించారు. ఆయన పద్యాలు సభికులను మంత్రముగ్ధులను చేస్తూ హర్షధ్వానాలు పొందాయి.

కార్యక్రమం అనంతరం అతిథులందరికీ ఘనంగా భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బంధుమిత్రులు, గ్రామస్తులు దంపతులకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో మోరంపూడి రమేష్, మోరంపూడి నాగేశ్వరరావు, వనమా వాసు,తీర్ధాల అబ్బుత రావు, బంధు మిత్రులు, మండల పరిధిలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Sthanikam

సాంప్రదాయ వేడుకల మధ్య ఘనంగా వజ్రాల సత్య వీర బ్రహ్మాచారి దంపతుల షష్ఠిపూర్తి బంధుమిత్రులు, గ్రామ పెద్దల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య వేడుకలు

Article Image

కవితలతో ఆకట్టుకున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఫిరంగి పుల్లయ్య

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల విద్యాశాఖాధికారి–2 వజ్రాల సత్య వీర బ్రహ్మాచారి, ఆయన సతీమణి విశ్వభారతి దంపతుల షష్ఠిపూర్తి మహోత్సవం వారి స్వగ్రామమైన చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దల సమక్షంలో సంప్రదాయ పద్ధతులతో నిర్వహించిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల నడుమ సాంప్రదాయ శోభను సంతరించుకున్నాయి.

వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ శుభకార్యక్రమంలో దంపతులు మరోసారి వివాహ బంధాన్ని గుర్తు చేసుకుంటూ పునర్వివాహ వేడుకలా ఆనందంగా పాల్గొన్నారు. గ్రామస్థులు, సన్నిహితులు దంపతులను పూలమాలలు, శాలువాలతో సత్కరించి వారి సేవలను ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో మండల పెద్ద దేశిరెడ్డి రాఘవరెడ్డి, చాట్రాయి మండల విద్యాశాఖాధికారి–1 మాసగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ విద్యా రంగంలో వజ్రాల సత్య వీర బ్రహ్మాచారి అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.

కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఫిరంగి పుల్లయ్య తన కవితా ప్రతిభను ప్రదర్శిస్తూ షష్ఠిపూర్తి దంపతులను ప్రశంసిస్తూ ప్రత్యేకంగా రచించిన పద్యాలను ఆలపించారు. ఆయన పద్యాలు సభికులను మంత్రముగ్ధులను చేస్తూ హర్షధ్వానాలు పొందాయి.

కార్యక్రమం అనంతరం అతిథులందరికీ ఘనంగా భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బంధుమిత్రులు, గ్రామస్తులు దంపతులకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో మోరంపూడి రమేష్, మోరంపూడి నాగేశ్వరరావు, వనమా వాసు,తీర్ధాల అబ్బుత రావు, బంధు మిత్రులు, మండల పరిధిలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News