సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
టీఎన్‌జీవో ఆధ్వర్యంలో తెలంగాణ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (టీఏఈవో) యూనియన్ సూర్యాపేట జిల్లా బాడీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలను టీఎన్‌జీవో జనరల్ సెక్రటరీ దున్న శ్యామ్ ఎన్నికల అధికారిగా నిర్వహించగా, ఉమ్మడి నల్గొండ జిల్లా టీఏఈవో జిల్లా అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీల ఆధ్వర్యంలో ఎన్నికలు సజావుగా జరిగాయి. ఈ సందర్భంగా
- జిల్లా అధ్యక్షుడిగా పెద్దపంగ ప్రణయ్ (ఏఈఓ – దుప్పహాడ్)
- జనరల్ సెక్రటరీగా ధరావత్ మనోజ్ కుమార్ (ఏఈఓ – పొనుగోడు)
- ట్రెజరర్‌గా షేక్ ముస్తఫా (ఏఈఓ – లింగగిరి)
- అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఆతుకూరి ఉప్పయ్య (ఏఈఓ – బృందావనపురం)
- ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా యూనియన్ నాయకులు మాట్లాడుతూ, తమ నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
యూనియన్ పక్షాన ఉద్యోగుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నల్గొండ టీఎన్‌జీవో వైస్ ప్రెసిడెంట్ వహీద్, సూర్యాపేట జిల్లా పరిధిలోని ఏఈఓలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి